అపాయింట్మెంట్ ఇచ్చిన పవన్ కల్యాణ్.. మనసులోని మాట బయటపెట్టిన నటుడు షిండే

by Gantepaka Srikanth |
అపాయింట్మెంట్ ఇచ్చిన పవన్ కల్యాణ్.. మనసులోని మాట బయటపెట్టిన నటుడు షిండే
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ను ప్రముఖ నటుడు షియాజీ షిండే(Actor Sayaji Shinde) కలిశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాయలంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆలయాల్లో దేవుడికి అభిషేకం చేసిన భక్తులకు ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా అందిస్తే పచ్చదనం పెరుగుతుందని షిండే అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ఆలయాల్లో దీనిని తక్షణమే అమలు చేస్తే భవిష్యత్ తరాలకు ఎంతో మేలు చేసిన వాళ్లం అవుతామని షిండే చెప్పారు.

కాగా, సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రంలో షియాజీ షిండే కీలక పాత్ర పోషించారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల అక్కినేని నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్‌బాస్ షోకు సుధీర్ బాబుతో కలిసి షిండే వెళ్లారు. ఈ క్రమంలోనే తన ఆలోచనను బయటపెట్టారు. తనకు పవన్ కల్యాణ్‌ను కలిసే అవకాశం వస్తే.. ఆయనకు ఈ విషయం చెప్పి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ఆలయాల్లో దీనిని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని అన్నారు. అది కాస్త పవన్ కల్యాణ్ కంట పడటంతో ఇవాళ అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో వారి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి.

Advertisement

Next Story

Most Viewed