- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీక్లీ పరేడ్‌తో పోలీసు సిబ్బందికి అవి లభిస్తాయి: ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
దిశ, మెదక్: వ్యాయామం కారణంగా అనారోగ్యానికి గురికాకుండా మంచి శక్తి సామర్థ్యాలతో విధులు నిర్వహించడానికి మంచి అవకాశం ఉంటుందని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శనివారం నూతన పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లాలోని సివిల్, ఆర్మీ, రిజర్వ్ పోలీస్ హోంగార్డు, సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వీక్లీ పరేడ్ తో సిబ్బందికి ఫిజికల్ ఫిట్నెస్‌తో పాటు శరీర దారుఢ్యం లభిస్తుందన్నారు. ఆరోగ్యాన్ని అనునిత్యం కాపాడుకోవాలి అన్నారు. క్రమశిక్షణతో డ్యూటీ, నిర్వహించాలని మెదక్ జిల్లాకు.. తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఏదైనా వ్యక్తిగత సమస్యలు ఉన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు నాగేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.