- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదివాసీల దీక్ష విరమణ.. చాకిరేవు సమస్యల పరిష్కారానికి హామీ
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: తమ గ్రామానికి నీరు, కరెంటు, రోడ్డు లాంటి కనీస వసతులు కల్పించాలనే డిమాండుతో గత మూడు రోజుల నుంచి నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా బైఠాయించిన ఆదివాసీలు శనివారం దీక్ష విరమించారు. పెంబి మండలం చాకిరేవు గ్రామంలో నీరు, రోడ్డు, కరెంటు, కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న ఆదివాసీలు.. ఐదు రోజుల క్రితం సాకి రేవు నుంచి కాలినడకన బయలుదేరి వచ్చారు. మూడు రోజులు ఎండలో 75 కిలోమీటర్ల కుటుంబ సభ్యులు, పిల్లలతో నడిచి నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకుని తమ డిమాండ్లను పరిష్కరించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మూడు రోజులుగా దీక్ష చేపట్టారు.
ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర మంత్రుల నుంచి ఆదేశాలు రావడంతో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, ఫారెస్ట్, ఇతర అధికార యంత్రాంగంతో గ్రామానికి చేరుకుని ఆదివాసిలతో చర్చలు జరిపారు. రెండు రోజుల క్రితం మూడు బోర్లు వేయగా రెండింటికి నీళ్లు వచ్చాయి. త్వరలో ఆ బోర్లకు హ్యాండ్ పంపు బిగించి నీటి సమస్య లేకుండా చేస్తామని.. త్వరలో కరెంట్, రోడ్డు వేస్తామని హామీ ఇవ్వడంతో ఆదివాసీలు ఈ రోజు దీక్షను విరమించారు. తమ డిమాండ్లను నెరవేర్చినందుకు కలెక్టర్, ఎస్పీకి ఆదివాసీలు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ డిఎస్పి ఉపేందర్ రెడ్డి, పట్టణ సీఐ శ్రీనివాస్ ఆదివాసులకు భోజనం ఏర్పాటు చేసి.. ప్రత్యేక వాహనంలో వారి స్వస్థలాలకు పంపించారు.