మోడీ క్రాప్‌డ్ వీడియో షేర్ చేసిన ఆప్.. రెడ్ సిగ్నల్ ఇచ్చిన ట్విట్టర్..

by Javid Pasha |
మోడీ క్రాప్‌డ్ వీడియో షేర్ చేసిన ఆప్.. రెడ్ సిగ్నల్ ఇచ్చిన ట్విట్టర్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్ర బీజేపీ పార్టీల మధ్య రాజకీయం రోజురోజుకు వేడెక్కుతుంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఆదివారం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన విధుల్లో చివరి రోజును ముగించుకున్నారు. అయితే రామ్‌నాథ్ కోవింద్ పదవి చివరి రోజుకు సంబంధించిన వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ ట్వీట్ చేసింది. ఈ వీడియోలో రామ్ నాథ్ కోవింద్ నమస్కారం పెడుతుంటే మోడీ మాత్రం పక్కకు చూస్తూ ఉన్నారు. ఈ వీడియో షేర్ చేసిన ఆప్.. 'వీరు ఇంతే సార్. మీ పదవీ కాలం పూర్తయింది కాబట్టి మీ వైపు కూడా చూడరు. ఇలాంటి అవమానానికి మేము క్షమాపణ కోరుతున్నాం' అని పేర్కొంది.

అయితే ఆప్ షేర్ చేసిన ఈ వీడియోకు ట్విట్టర్ రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వీడియో సందర్భం బయట విషయాన్ని ప్రదర్శిస్తుందని ట్విట్టర్ పేర్కొంది. ఈ వీడియోను క్రాప్ చేయబడిందని, ఇందులో అసలు నిజం లేదు. అసలు వీడియోలో మాత్రం.. రాష్ట్రపతి నమస్కారం చేసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రతినమస్కారం చేశారు. ఆ తర్వాత పక్కకు చూశారు. కానీ ఆప్ నేతలు మాత్రం మోడీ పక్కకు చూస్తున్నంతవరకు వీడియోను క్రాప్ చేసి షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆప్ చేసిన పనికి నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed