ఆది పినిశెట్టి ఇంట్లో విషాదం.. నువ్వు దూరమైనందుకు చాలా బాధగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్

by Hamsa |
ఆది పినిశెట్టి ఇంట్లో విషాదం.. నువ్వు దూరమైనందుకు చాలా బాధగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి(Aadhi Pinisetty) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తమ పెంపుడు శునకం చనిపోయింది. తొమ్మిదేళ్లుగా బిడ్డలాగా ప్రేమను కురిపిస్తూ పెంచుకుంటున్న పెట్ డాగ్ ఆదివారం చనిపోవడంతో ఆది పినిశెట్టి కుటుంబ సభ్యులు దు:ఖంలో మునిగిపోయారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన భార్య నిక్కీ గల్రానీ(Nikki Galrani) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘నీ కాలి ముద్రలు మా మనసుపై స్థిరంగా ఉన్నాయి. అవి ఎప్పటికీ చెరిగిపోవు. మై బేబీ, నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నువ్వు ఎప్పటికీ మంచి అబ్బాయివే. మరోసారి కలుసుకుందాం చాంప్’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా తన పెట్‌తో తీసుకున్న ఫొటోల(Photos)ను షేర్ చేసింది. ప్రస్తుతం నిక్కీ గల్రానీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా రెస్ట్ ఇన్ పీస్ అని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story