- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'కొడుకు ఏడుస్తుండగానే.. నన్ను రేప్ చేశారు': ఉక్రెయిన్ మహిళ ఆవేదన
దిశ, వెబ్‌డెస్క్: దాదాపు నెల రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా భయంకరమైన దాడులు చేస్తోంది. రాకెట్లు, బాంబులతో విరుచుకుపడుతోంది. రష్యా సైనికులు ఉక్రెయిన్ పౌరులపై దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా.. ఓ ఉక్రెయిన్ మహిళ తనకు జరిగిన దారుణాన్ని బయటపెట్టింది. రష్యా సైనికులు తనని అత్యాచారం చేశారని ఆరోపించింది. 'ఈ నెల 9వ తేదీన రష్యా సైనికులు మా ఇంటికి ఇచ్చారు. ముందుగా నా భర్తను కాల్చి చంపారు. నా భర్త నాజీ అని, అందుకే హత్య చేశామని ఓ రష్యా సైనికుడు అన్నాడు.
నా భర్తను కళ్ల ముందే దారుణంగా చంపడంతో.. నేను గట్టిగా ఏడ్చాను. వెంటనే ఆ సైనికులు ఏడుపు ఆపాలని లేదంటే.. నీ కొడుకు ముందే నిన్ను చంపేస్తామని బెదిరించారు. తర్వాత వారు నన్ను బట్టలు విప్పాలని గన్‌తో బెదిరించారు. అనంతరం రష్యా సైనికులు నాపై సామూహిక అత్యాచారం చేశారు. వారు నాపై అత్యాచారం చేస్తుంటే పక్క గదిలోనే నా కొడుకు ఏడుస్తున్నాడు. రేప్ చేసిన తర్వాత వారు నన్ను చంపకుండా వెళ్లిపోయారు. వెంటనే నేను ఆ ప్రదేశం నుండి వేరే ప్రాంతానికి వెళ్లాను' అని తెలిపింది.