తల వెంట్రుకలతో ఐబ్రోస్ సర్జరీ.. ఇలా మారిన మహిళ

by S Gopi |
తల వెంట్రుకలతో ఐబ్రోస్ సర్జరీ.. ఇలా మారిన మహిళ
X

దిశ, ఫీచర్స్ : అతివలు అందానికి ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. సెలబ్రిటీలైతే తమ బ్యూటీనెస్ కోసం సర్జరీలతో బాడీ షేప్స్ మార్చుకునేందుకు కూడా వెనకాడటం లేదు. అలానే సాధారణ మహిళల్లోనూ ఇపుడు హైబ్రోస్ షేపింగ్ కామన్ అయిపోయింది. ఇదిలా ఉంటే.. టీనేజ్‌లో తన హైబ్రోస్‌ను పరిమితికి మించి షేప్ చేయించుకున్న ఒక యూకే మహిళ.. నిండైన కనుబొమ్మల కోసం సర్జరీని ఆశ్రయించింది. ఇపుడు వేగంగా పెరుగుతున్న కనుబొమ్మలను నెలకోసారి కత్తిరించుకుంటోంది.

పలుచటి కనుబొమ్మలతో బాధపడుతున్న ఇసాబెల్లె కుత్సి.. ఫేస్‌పై వాటిని డ్రా చేసేందుకు డైలీ 30 నిమిషాల టైమ్ కేటాయించేది. దీంతో విసుగు చెందిన ఆమె ఐబ్రోస్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకుని పోలాండ్‌లోని డాక్టర్స్‌ను సంప్రదించింది. ఈ క్రమంలోనే డాక్టర్లు.. ఆమె తల వెనుక భాగంలో కొన్ని వెంట్రుకలను కుదుళ్లతో యుక్తంగా తీసి కనుబొమ్మల ప్రదేశంలోని చిన్న చిన్న రంధ్రాల్లో ఇంప్లాంట్ చేశారు. దాదాపు మూడు గంటలపాటు ఈ సర్జరీ నిర్వహించగా.. ఆ తర్వాత తన ఐబ్రోస్ చూసుకున్న కుత్సి ఆనందంతో పొంగిపోయింది. అయితే ఇక్కడ మరొక చిక్కు ఏంటంటే.. తల నుంచి తీసి అమర్చిన వెంట్రుకలు హైబ్రోస్ ఏరియాలోనూ వేగంగా పెరుగుతాయి. కాగా ఈ సర్జరీకి £1,500 (రూ. 1.4 లక్షలు) చెల్లించింది.

సర్జరీ అనుభవాన్ని వివరించిన ఇసాబెల్లె.. 'ఈ ప్రక్రియ నొప్పి లేకుండా ఉంది. తల, ఐబ్రోస్‌ ప్రాంతంలో రెండు మత్తు ఇంజక్షన్స్ ఇచ్చినపుడు మాత్రమే నొప్పి అనుభవించాను. రెండు వారాల పాటు కనుబొమ్మలు వాష్ చేయడమే కాక తాకొద్దని డాక్టర్స్ చెప్పారు. అయితే ఇవి పెరిగేందుకు దాదాపు నాలుగైదు నెలలు పట్టింది. ఇంకా పూర్తిగా పెరిగేందుకు ఎనిమిది నెలల సమయం పడుతుందని డాక్టర్స్ చెప్పారు' అని పేర్కొంది.

'ఒకప్పుడు ఫొటోలు తీసుకోవడం ఇష్టముండేది కాదు. తరచూ నా ఐబ్రోస్‌ చూసుకుని అసహ్యించుకునేదాన్ని. ఒకవేళ ఎవరైనా ఫోటోలు తీస్తే కనుబొమ్మలపై చేయి అడ్డుపెట్టుకునేదాన్ని. ఇక ఇప్పుడు ఆ భయం లేదు. యవ్వనంగా కనిపిస్తున్నాను. నా మేకప్ టైమ్ తగ్గిపోయింది. ఓ విధంగా ఈ ప్రక్రియ నా జీవితాన్ని మార్చేసింది' అంటూ చాలా ఎగ్జైటింగ్‌గా ఫీలైంది.

Advertisement

Next Story