- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ సెల్లర్ ఘనత.. కోచింగ్ లేకుండా ఐఏఎస్‌కు ఎంపిక
దిశ, ఫీచర్స్ : లక్ష్యాన్ని సాధించే క్రమంలో అడ్డంకులు, ఒడిదుడుకులు తప్పవు. వాటన్నింటినీ తట్టుకుని ముందడుగేస్తేనే విజయం వరిస్తుంది. అందుకే జీవితంలో సక్సెస్‌ను ఆశించే వ్యక్తికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం పట్టుదల. ఇలా అంకితభావం, పట్టుదలనే ఆయుధంగా చేసుకున్న ఓ టీ సెల్లర్.. ఎటువంటి కోచింగ్ లేకుండా ఐఏఎస్ సాధించి ఆదర్శంగా నిలిచాడు.
ఐఏఎస్ హిమాన్షు గుప్తా స్టోరీ:
ఉత్తరాఖండ్, సితార్‌గంజ్ జిల్లాకు చెందిన హిమాన్షు గుప్తా బాల్యం దుర్భరంగా గడించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల మూలంగా కడు పేదరికాన్ని అనుభవించాడు. రోజువారీ కూలీ అయిన తండ్రి సంపాదన సరిపోక.. తను కూడా ఓ టీ స్టాల్‌లో పార్ట్ టైమ్ పనిచేసేవాడు. ఎలాగోలా పాఠశాల విద్యను పూర్తి చేసిన హిమాన్షు.. పై చదువుల కోసం ఢిల్లీ యూనివర్సిటీలో చేరాడు. అక్కడ ట్యూషన్లు చెప్పుకుంటూ కాలేజీ ఫీజులు చెల్లించేవాడు. చివరకు మాస్టర్స్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ సాధించిన హిమాన్షు.. సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇదే క్రమంలో కుటుంబ అవసరాల కోసం గవర్నమెంట్ కాలేజీలో రీసెర్చ్ స్కాలర్‌గా చేరాడు. ఈ అవకాశం తనకు స్టైఫండ్ సంపాదించడంలో సాయపడటమే కాకుండా సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమయ్యేందుకు ఉపయోగపడింది.
మొత్తానికి హిమాన్షు ఎటువంటి కోచింగ్ లేకుండానే మూడుస్లార్లు UPSCలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌కు ప్రయత్నించాడు. ఫస్ట్ టైమ్ సివిల్ సర్వీసెస్‌కు అర్హత సాధించి IRTSకు ఎంపికయ్యాడు. రెండోసారి IPSకు అర్హత సాధించాడు. కానీ తను అనుకున్నది సాధించేవరకు పట్టు వదలని హిమాన్షు.. మూడో ప్రయత్నంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్(IAS)కు ఎంపికై తన కల నెరవేర్చుకున్నాడు. ఇలా తన కుటుంబాన్ని కష్టాల ఊబి నుంచి బయటపడేయడమే కాక పెద్దపెద్ద కలలు కనే ఔత్సాహికులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు.