- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారికి గట్టి కౌంటర్.. కిరణ్ అబ్బవరం ఎమోషనల్ ట్వీట్
దిశ, వెబ్డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రాజావారు రాణివారు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఈ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం చిత్రంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. అయితే జూలై 15న తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
'' పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన అందరినీ థాంక్యూ. షార్ట్ ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్, నా తదుపరి చిత్రాలు.. ఇలా జీవితంలోని ప్రతిదశలో అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. నా ఎదుగుదలకు సపోర్టే ఇంధనం. దానికి థ్యాంక్స్ మాత్రమే సరిపోదు. మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేసేందుకు ఇంకా కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నాను. ఇన్ని సినిమాలు ఎలా వస్తున్నాయి ? బ్యాగ్రౌండ్ ఏంటీ ? గట్టి సపోర్ట్ ఉందేమో ? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ నా సమాధానం ఒక్కటే హార్డ్ వర్క్. క్లాసులో మనకు తక్కువ మార్కులు వచ్చాయన్న దానికంటే పక్కవాడికి ఎక్కువ మార్కులు ఎలా వచ్చాయనే బాధ, నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. అలాంటి నెగిటివిటీ నాపై వస్తోంది. అంటే జీవితంలో నేనేదో పాజిటివ్ గా సాధించానని అర్థం. ఈ పని కోసమే ఎన్నో ఏళ్లు తిరిగాను. నేను కోరుకున్న పని నాకు వచ్చినప్పుడు దాన్ని ఇష్టపడి చేస్తున్నా ''అంటూ కిరణ్ చెప్పుకొచ్చాడు.
❤️❤️#Cinema #Greatful pic.twitter.com/2S6PidyYtP
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) July 17, 2022