- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనిషి పళ్లు తోమిన రొయ్య.. నెట్టింట్లో వైరల్ వీడియో
దిశ, ఫీచర్స్: ఎవరైనా దంతాలు శుభ్రపరుచుకోవాలంటే డెంటిస్ట్‌ను సంప్రదిస్తారు. ఒకవేళ వైద్య ఖర్చులు భరించలేకుంటే అందుబాటులో ఉన్న ఇతర పద్ధతులను ఆశ్రయిస్తారు. కానీ ఒక స్కూబా డైవర్.. సముద్ర జలాల్లోని రొయ్యతో పళ్లు క్లీన్ చేయించుకుంటున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా, అసలు రొయ్య మనిషి పళ్లు తోమడం ఏంటని సందేహిస్తున్నారు కదా! అయితే 'అమేజింగ్ నేచర్స్' ట్విటర్ హ్యాండిల్‌లో పోస్టు చేసిన వీడియో చూడాల్సిందే.
ఈ వైరల్ వీడియోలో.. ఒక స్కూబా డైవర్ సముద్రపు అంతర్భాగంలోని కోరల్ రీఫ్(పగడపు దిబ్బలు) వద్ద కనిపించాడు. అతను ఉన్నట్టుండి ఒక్కసారిగా నోరు తెరవగా, వెంటనే తెల్లటి మీసాలు గల ఓ రొయ్య పిల్ల తన నోటిలో దూరింది. ఆ తర్వాత డైవర్ పళ్ల మధ్య ఇరుక్కున్న ఫుడ్, డెడ్ సెల్స్‌ను తన కాళ్లతో శుభ్రం చేయడం మొదలుపెట్టింది. ఇక అది క్లీన్ చేస్తున్నంతసేపు సదరు స్కూబా డైవర్ సైతం ఓపికగా వేచి ఉండటం విశేషం. అయితే ఈ ఇన్సిడెంట్ మొత్తాన్ని సెల్ఫ్ వీడియోలో క్యాప్చర్ చేసిన అతను.. 'టీత్ క్లీనింగ్ కావాలంటే సంప్రదించండి' అనే క్యాప్షన్‌తో పోస్టు చేశాడు.
ఈ క్లీనర్ రొయ్యలు ప్రపంచవ్యాప్తంగా మహాసముద్రాల్లోని పగడపు దిబ్బలపై నివసిస్తాయి. కానీ పసిఫిక్ మహాసముద్రంలోనే వీటి సంతతి ఎక్కువ. డెడ్ స్కిన్, పరాన్నజీవులుగా పిలువబడే చిన్న చిన్న హానికర జీవులను చేపల శరీరం నుంచి తొలగించడం ద్వారా అవి శుభ్రంగా ఉండటంలో ఈ రొయ్యలు సాయపడతాయి.
Need Teeth Clean Contact me pic.twitter.com/7GSJdQjHjx
— Amazing Nature (@AmazingNature00) April 8, 2022