Health tips: చికాకు తెప్పించే అనారోగ్య సమస్యలకు దివ్యౌషధం..!!

by Anjali |   ( Updated:2024-10-28 05:48:42.0  )
Health tips: చికాకు తెప్పించే అనారోగ్య సమస్యలకు దివ్యౌషధం..!!
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఎవరికైనా తలనొప్పి(headache) వస్తే వెంటనే టీ తాగుతారు లేదా మెడికల్ షాపు(Medical shop)కు పరుగులు తీస్తారు. కానీ టాబ్లెట్ యూజ్ చేయడం కన్నా.. సాధారణ టీ కంటే నిమిషాల్లో చికారు తెప్పించే వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే టీ ఒకటి ఉంది. అదే అల్లం-లెమన్ టీ. ఈ కాంబినేషన్ తో టీ తాగితే ఎంతటి తలనొప్పి అయినా ఇట్టే తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం తలనొప్పి మాత్రమే కాకుండా ఈ అల్లం టీ తాగితే వాంతులు(vomiting), జీర్ణకోశ సమస్యలు(Gastrointestinal problems) వంటి ఎన్నో వ్యాధులను దూరం చేయవచ్చు. మరీ లెమన్, అల్లం టీ(Lemon and ginger tea) తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం..

లెమన్ జింజర్ టీకి కావాల్సిన పదార్థాలు..

నిమ్మకాయ-1, తాజా అల్లం (చిన్న ముక్కలు)- 4,

వేడినీరు- 4 కప్పులు తీసుకోవాలి.

అల్లం టీ తయారు చేసే విధానం..

ముందుగా అల్లం(ginger) ముక్కల్ని తురుముగా చేసుకుని.. ఒక బౌల్‌లో వేసి ఉడకబెట్టాలి. తర్వాత లెమన్ రసాన్ని అందులో వేయండి. ఐదు నిమిషాలయ్యాక స్టవ్ ఆఫ్ చేసి.. గ్లాస్‌లో పోసుకుని గోరువెచ్చగా అయ్యాక తాగితే రోజంతా యాక్టివ్‌(Active)గా ఉండటమే కాకుండా పలు రోగాలను తరిమికొడుతోంది. ఒక్కసారి తయారు చేసిన టీని రోజులో నాలుగైదు సార్లు వేడి చేసుకుని తాగవచ్చు. అల్లం-లెమన్ టీ కడుపు ఉబ్బరం, అజీర్ణం సమస్యలను వేగంగా తగ్గించడంలో మేలు చేస్తుంది. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants)పుష్కలంగా ఉంటాయి.

దీంతో శరీరానికి కావాల్సినంత ఇమ్యూనిటి పవర్(Immunity power) అందుతుంది. అంతేకాకుండా ఈ టీ జలుబు, ఫ్లూ(Cold, flu) వంటి వ్యాధుల నుంచి కాపాడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. బరువు తగ్గించడానికి కూడా మేలు చేస్తుంది. కీళ్ల నొప్పులు, వాపు,కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి(Vitamin C), యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి.. క్యాన్సర్, గుండె కు సంబంధించిన వ్యాధుల(Cancer and heart diseases)ను దరిచేరనివ్వకుండా చేస్తుంది. కాగా రోజుకు ఒక్కసారి అయినా ఈ టీ తాగితే ఆరోగ్యానికి మేలే తప్ప నష్టాలు లేవంటున్నారు నిపుణులు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed