- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాన్న, సోదరుడు, తాత, అంకుల్.. బాలికపై ఐదేళ్లుగా అత్యాచారం
పుణె : బాలికను కంటికి రెప్పలా కాపాడాల్సిన కుటుంబీకులే ఆమెపై కన్నేశారు. ఒకరికి తెలియకుండా మరొకరు శారీరక సుఖం పొందుతూ మైనర్‌పై పైశాచికత్వానికి పాల్పడుతున్నారు. బాధితురాలు చదువుతున్న పాఠశాలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే అవగాహన సదస్సులో భాగంగా తనపై ఐదేళ్లుగా జరుగుతున్న ఘోరాన్ని బాహ్య ప్రపంచానికి వివరించింది బాలిక. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగి శనివారం నలుగురిపై కేసు నమోదు చేశారు. పుణె ఇన్‌స్పెక్టర్ అశ్విని సత్పుటే కథనం ప్రకారం.. బిహార్‌కు చెందిన బాలిక కుటుంబం బతుకుదెరువు కోసం ప్రస్తుతం పుణెలో నివాసం ఉంటోంది.
పదకొండేళ్ల మైనర్‌కు తల్లి సంరక్షణ దూరం కావడంతో కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురిపై కన్నేశాడు. 2017లో బిహార్‌లో ఉన్నప్పటి నుంచి ఆమెపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. తన సోదరుడు కూడా 2020 నుంచి లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. వీరితో పాటు బాలిక తాత, దూరపు బంధువు(వరుసకు అంకుల్) కూడా మైనర్‌ను అసహ్యంగా తాకుతూ తమ కామవాంఛ తీర్చుకునేవారు. ఇదంతా ఒకరికి తెలియకుండా ఒకరు చేశారని తెలుస్తోంది. తీరా ఈ విషయం వెలుగులోకి రావడంతో ఐపీసీ 376, 354తో పాటు పోక్సో చట్టం కింద 45ఏళ్ల తండ్రి, 60 ఏళ్ల తాత, సోదరుడు, 25 ఏళ్ల అంకుల్‌పై కేసు నమోదు చేశారు. అయితే, సామూహిక అత్యాచారం జరగలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు క్రైమ్ ఇన్స్పెక్టర్ అశ్విని తెలిపింది.