- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం మత్తులో హల్ చల్.. ఏకంగా హోంగార్డ్‌పైనే కత్తితో దాడి
దిశ ప్రతినిధి, నిజామాబాద్: బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా హోంగార్డ్‌ను మందు బాబు కత్తితో పొడిచాడు. ఈ సంఘటన సోమవారం 5వ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరగడం గమనార్హం. వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 5వ టౌన్ పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ విజయ్ హోంగార్డు చంద్రకాంత్‌లు ఈ పెట్టి కేసుల కోసం న్యాల్కల్ రోడ్‌లో రూట్ వాచ్ చేస్తున్నారు. కొందరు వ్యక్తులు ఆటోలో కూర్చుండి మద్యం సేవిస్తున్న విషయాన్ని గుర్తించి పట్టుకునేందుకు యత్నించారు. దొరికిన వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తరలించగా అక్కడ హోంగార్డును సదరు వ్యక్తి కత్తితో పొడిచి ఆటోతో సహా పరారయ్యాడు. గాయపడిన హోంగార్డ్ చంద్రకాంత్ ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చంద్రకాంత్ పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. హోంగార్డును కత్తితో పొడిచిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న.. మద్యం మత్తులో ఉండడంతో ఆసుపత్రికి తరలించారని అనుమానాలు ఉన్నాయి. ఈ మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.