- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాగుడు మానలేక.. అప్పులు తీర్చలేక.. చివరికి!
దిశ, భిక్కనూరు: తాగుడు మానలేక.. అందు కోసం చేసిన అప్పులు తీర్చలేక.. తీవ్ర మనోవేదనకు గురై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన భిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన దొంతి రెడ్డి నరసింహా రెడ్డి గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి పనులు చేయకుండా, ఇంటి వద్దే ఖాళీగా కూర్చుంటూ.. తాగుడుకు బానిసయ్యాడు. ఇందుకోసం కోసం చేసిన అప్పులు తీర్చలేక పోవడం, ఆరోగ్యం బాగా దెబ్బ తినడంతో మానసికంగా కుంగిపోయాడు. తాగేందుకు జేబులో డబ్బులు లేకపోవడం, తన భార్య సోదరుడి పెళ్లి ఉందని గత నెల క్రితం రామారెడ్డి లోని పుట్టింటికి వెళ్లడం, కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో శనివారం రాత్రి ఇంట్లోని బెడ్ రూంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇంట్లోకి వచ్చి చూసేసరికి ప్రాణాపాయం తో కొట్టుమిట్టాడుతున్న, నరసింహా రెడ్డి ఉరి వేసుకున్న బెల్ట్ తీసి కిందకి దించేందుకు యత్నించగా మృతి చెందాడు. మృతునికి భార్య లత, ఇద్దరు కుమారులు ధనుంజయ్, దర్శన్ తల్లిదండ్రులు ఉన్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆదివారం పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్రానికి తరలించారు.