చలాన్లు తప్పించుకోవడానికి వినూత్న ప్రయత్నం.. ఏం చేశాడంటే..?

by Javid Pasha |
చలాన్లు తప్పించుకోవడానికి వినూత్న ప్రయత్నం.. ఏం చేశాడంటే..?
X

దిశ, వైరా: వైరా రాష్ట్ర రహదారిపై నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. వీరిలో కొంతమంది వాహనదారులు తమ ఇష్టానుసారంగా వాహనం నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ, రోడ్లపై అతివేగంగా వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతుంటారు. వారిని అదుపు చేసేందుకు పోలీసు శాఖ ఎప్పటికప్పుడు చలాన్లు వేస్తున్నారు. అతి వేగంగా వెళ్తున్న వాహనాలను స్పీడ్ గన్ ద్వారా సెల్ఫోన్లలో ఫోటోలు తీసి వాహనదారులు జరిమానాలను ఈ చలాన్ ద్వారా ఇంటికి పంపిస్తున్నారు. ఇలా పోలీసులు విధించే జరిమానాలు తప్పించుకునేందుకు కొందరు అనేక విధాలుగా ప్రయత్నిస్టుంటారు. ఇందులో భాగంగా నెంబర్ ప్లేటు కనిపించకుండా రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు.

ఇందులో భాగంగానే కొందరు నెంబర్ ప్లేటు వంచి వేయడం. మరికొందరు స్టిక్కర్లు అంటించడం, చిన్న చిన్న అక్షరాలను నెంబర్ ప్లేట్‌పై రాయడం, అసలు నెంబర్ ప్లేట్ లేకుండా తిరగడం వంటివి ఉన్నాయి. తాజాగా వైరాలో ఓ యువకుడు చేసిన ఆలోచన అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది. పోలీసుల చలాన్లను తప్పించుకోవాడానికి ఏకంగా ముఖానికి పెట్టుకునే మాస్క్‌ను ఏకంగా నెంబర్ ప్లేటుకు తగిలించి వైరా ప్రధాన రహదారి రోడ్ల వెంబడి జల్సాగా చక్కర్లు కొడుతున్నాడు. ఇలా నెంబర్ ప్లేట్ కనపడకుండా వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed