తెలివి నేర్చిన ఇసుక మాఫియా.. పెట్రోలింగ్ అధికారులు ఫెయిల్

by Disha News Desk |
తెలివి నేర్చిన ఇసుక మాఫియా.. పెట్రోలింగ్ అధికారులు ఫెయిల్
X

దిశ, రాజంపేట: మండలంలోని నడిమి తండా, గుండారం గ్రామ సరిహద్దులో ఉన్న పెద్ద వాగులో ఇసుక దందా జోరుగా కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి అనుబంధ అనుమతులు తీసుకొని రుసుము చెల్లించిన తర్వాత ఇసుక తీసుకోవాలి. కానీ ఆ నిబంధనలను తుంగలో తొక్కి ఇసుక మాఫియా వందల కొద్ది ట్రాక్టర్ల ఇసుక తీసుకెళ్తున్నారు. ఒకవైపు అటవీశాఖ అధికారులు అటవీ సంపద కాపాడడం కోసం రాత్రి పగలు కష్టపడుతూ అడవి చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారి కళ్లు కప్పి ఇసుక మాఫియా కేటుగాళ్లు పదుల ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. దాదాపు రోజుకు 10 నుండి 20 ట్రాక్టర్లతో ఈ రవాణా చేస్తున్నారు.

ఇటీవలే వాగు మధ్యలో నీటి నిల్వ కోసం రూ. 2 కోట్లు వెచ్చించి ప్రభుత్వం రెండు చెక్‌డ్యాంలను నిర్మించారు. ఈ చెక్‌డ్యాం ఎత్తు పెద్దగా ఉండడంతో దాని చాటుగా వాగులో ఉన్న ఇసుకను స్వేచ్ఛగా తీసుకెళ్తున్నారు. ఒక్కో ఇసుక ట్రాక్టర్ దాదాపు 6000 నుండి 8000 వరకు అమ్మి డబ్బు సంపాదిస్తున్నారు. సమాచారం అందుకొని అటవీ శాధికారులు వెళ్లే సరికి వారు పారిపోతున్నారని అటవీ శాఖధికారులు అంటున్నారు. వీటికి అడ్డు చెప్తే వారిపై దాడి చేయడానికి కూడా వెనుకాడడం లేదని గ్రామస్తులు తెలుపుతున్నారు. పోలీస్ శాఖ రాత్రిపూట పెట్రోలింగ్ చేసే సమయానికి ముందే ఇసుక తరలిస్తున్నారు. ఈ ఇసుక మాఫియాను అరికట్టి అటవీ సంపదను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story