- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
మానవ మాంసం రుచితో బర్గర్ తయారీ
దిశ, ఫీచర్స్ : 'ఓంఫ్' అనే స్వీడిష్ ఫుడ్ కంపెనీ.. హ్యూమన్ ఫ్లష్‌ను(మనిషి మాంసం) పోలి ఉండే మొక్కల ఆధారిత వెజ్ బర్గర్ తయారు చేసింది. అత్యంత రుచికరంగా ఉన్న ఈ ఫుడ్.. గత వారం జరిగిన కేన్స్ లయన్స్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీలో 'సిల్వర్ బ్రాండ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ యాక్టివేషన్ లయన్' అవార్డ్ గెలుచుకుంది. ఈ మేరకు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది.
ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో అవార్డు గెలుచుకోవడం పట్ల కంపెనీ కోఫౌండర్, కార్పొరేట్ చెఫ్ అయిన అండర్స్ లిండెన్స్ ఎగ్జైటింగ్‌గా ఉందని తెలిపాడు. 'మనిషి మాంసాన్ని పోలిన రుచితో మొక్కల ఆధారిత బర్గర్ తయారు చేయడం పట్ల సంతోషంతో పాటు కొంచెం భయంగానూ ఉందని పేర్కొన్నాడు. మొక్కలు ఉపయోగించి ఏ రకమైన ఫుడ్ అయినా తయారు చేయడం సాధ్యమవుతుందని చూపించడమే మా ప్రయత్నమని వివరించారు. కాగా ఈ బర్గర్ ఎక్కువగా సోయా, పుట్టగొడుగులు, గోధుమ ప్రోటీన్స్‌తో పాటు మొక్కల ఆధారిత కొవ్వులు, 'మిస్టీరియస్' మసాలా మిశ్రమంతో తయారు చేయబడింది.
కాగా ఈ బర్గర్ ప్రజల ఆహార అలవాట్లను సవాల్ చేయాలని కోరుకుంటున్నట్లుగా ఓంఫ్ కంపెనీ గ్లోబల్ లీడర్ హెన్నిక్ అకెర్మా తెలిపారు. చిన్న బ్రాండ్ అయినప్పటికీ ఫుడ్ బౌండరీస్‌ను బ్రేక్ చేయాలనుకుంటున్నట్లుగా చెప్పారు. అయితే ఈ ఫుడ్ చాలా అద్భుతంగా ఉందని కొందరు భావిస్తుండగా.. మరికొందరు మాత్రం అసహ్యకరమైన ఆలోచనగా పేర్కొంటున్నారు.