వెలుగులు నింపిన గృహజ్యోతి.. డిస్కంలకు రూ.1200 కోట్లు

by Rani Yarlagadda |   ( Updated:2024-11-13 03:45:33.0  )
వెలుగులు నింపిన గృహజ్యోతి.. డిస్కంలకు రూ.1200 కోట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ వెలుగులు పేద, మధ్య తరగతి వారికి భారం కాకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం అరకోటి ఇళ్లలో వెలుగులు నింపుతోంది. ఆర్థిక భారాన్ని తగ్గిస్తోంది. తాము పవర్‌లోకి రాగానే 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్‌ను పేద, మధ్య తరగతి వారికి ఉచితంగా అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఆ మేరకు అధికారంలోకి వచ్చాక మార్చి నుంచి గృహజ్యోతి పథకం ప్రారంభించింది. ఈ స్కీమ్‌తో రాష్ట్రంలో ప్రతినెలా దాదాపుగా 50 లక్షల మంది వినియోగదారులు లబ్ధిపొందుతున్నారు. సర్కారు ఈ పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.1,200 కోట్ల విలువైన విద్యుత్ బిల్లులను వినియోగదారుల తరఫున డిస్కంలకు చెల్లించింది.

కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో భాగంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకునే వినియోగదారులకు జీరో బిల్లులను ఇస్తున్నారు. స్కీమ్ ప్రారంభించిన మొదటి నెలలో 42.50 లక్షల మంది వినియోగదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 33.83 లక్షల మందికి జీరో బిల్లును అందించారు. వీరు చెల్లించాల్సిన రూ.98.80 కోట్ల బిల్లులను ప్రభుత్వమే చెల్లించింది. అక్టోబరు‌లో 49,28,052 మంది లబ్ధిదారులకు 46,70,606 జీరో బిల్లులు జారీ కాగా, వీరు చెల్లించాల్సిన రూ.171.75 కోట్లను సర్కారు చెల్లించింది. దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరికి వివిధ కారణాలతో ఇంకా జీరో బిల్లులు అమలు కావడంలేదని వినియోగదారులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు సమయంలో మీటరు నంబర్ రాయకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో అర్హులైన మరికొందరికి పథకం అమలు కావడం లేదంటున్నారు.



Advertisement

Next Story

Most Viewed