సెక్స్ లైవ్స్ ఆఫ్ ఆఫ్రికన్ ఉమెన్..

by Manoj |
సెక్స్ లైవ్స్ ఆఫ్ ఆఫ్రికన్ ఉమెన్..
X

దిశ, ఫీచర్స్ : 'వ్యక్తిగత స్వేచ్ఛ.. సొంత శరీరంపై హక్కు.. ప్రేమించే వారిని ఎంచుకునే అధికారం.. ఎవరితో సంబంధాలు కలిగి ఉండాలి.. ఎవరిని దూరం పెట్టాలి'.. వంటి విషయాల్లో ఆఫ్రికన్ స్త్రీలు ఏం కోరుకుంటున్నారో వివరిస్తోంది 'ది సెక్స్ లైవ్స్ ఆఫ్ ఆఫ్రికన్ ఉమెన్' పుస్తకం. ఆఫ్రికా ఖండంలో సెక్సువల్ రెవల్యూషన్‌కు కారణమవుతున్న ఈ బుక్.. ఇపుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహిళల శృంగారపరమైన ఆనందం, ఆపద, బాధల మిశ్రమంగా.. 32 మంది నిజజీవిత అనుభవాలను పుస్తకంగా తీసుకురావడంపై రచయిత నానా దార్కోవా సెకియామాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతకీ ఈ పుస్తక ప్రత్యేకతలేంటో చూద్దాం..

ఆఫ్రికాలో సెక్స్ గురించి మాట్లాడటం అసాధారణం. ముఖ్యంగా స్త్రీలు ఈ విషయంలో ఓపెన్ కావడం చాలా అరుదు. అయితే ఘనాలో బీచ్ ట్రిప్‌కు వెళ్లిన సమయంలో ఫ్రెండ్స్ అందరూ కలిసి అన్ని విషయాలపై చర్చిస్తూనే సెక్స్ కన్వర్జేషన్‌ కూడా లేవనెత్తారు. జీవితంలో మొదటిసారి ఇలాంటి సంభాషణ విన్న సెకియామా.. వారి సెక్సుల్ ఎక్స్‌పీరియన్స్, కోరికలు, ఫ్యాంటసీల గురించి విని ఆశ్చర్యపోయింది. స్నేహితులతో ఆ సంభాషణ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా.. నిర్భయంగా, నాన్ జడ్జ్‌‌మెంటల్‌గా, కంఫ్టర్ అండ్ సేఫ్‌గా అనిపించడంతో ఆమెకు ఒక ఆలోచన తట్టింది. ఆఫ్రికన్ మహిళలందరూ ఈ విషయంలో ఇలాగే చర్చించుకునేందుకు ఓ బ్లాగ్ తీసుకురావాలని అనుకుంది. అనుకున్నట్లుగానే ఓ బ్లాగ్ క్రియేట్ చేయగా.. తనతో పాటు 32 మంది ఎకౌంట్స్ నుంచి వచ్చిన సెక్సువల్ ఒపీనియన్స్‌ను 'ది సెక్స్ లైవ్స్ ఆఫ్ ఆఫ్రికన్ ఉమెన్' పుస్తకంగా తీసుకొచ్చింది.

లైంగిక విముక్తిపై చర్చించిన పుస్తకం..

ఈ పుస్తకం ఆఫ్రికన్ మహిళలు తమ లైంగిక అనుభవాల ద్వారా స్వేచ్ఛ, ఆనందం, స్వస్థత కోసం ప్రయత్నించిన మార్గాలను ఎక్స్‌ప్లోర్ చేసింది. పాఠశాలల్లో సమగ్రమైన లైంగిక విద్య అంతంతమాత్రంగానే ఉన్నటువంటి ఖండంలో.. మతపరమైన, సామాజిక సంప్రదాయాలు స్త్రీలు తమ లైంగికతను అన్వేషించకుండా, బహిరంగంగా చర్చించకుండా నిరోధించిన విధానాన్ని వివరించింది. దీంతో 'ది సెక్స్ లైవ్స్ ఆఫ్ ఆఫ్రికన్ ఉమెన్' పుస్తకం ఆఫ్రికన్ డయాస్పోరా అంతటా చర్చకు దారితీసింది. లైంగిక విముక్తిపై చర్చించిన పుస్తకం.. బాధ, ఆనందం రెండింటితో కూడిన అనుభవాలను సంగ్రహించడంతో పాటు ప్రపంచమంతా ఆఫ్రికన్ స్త్రీ శరీరంపై చూసిన చూపులను నిర్వీర్యం చేయడంలో సాయపడింది. అంతేకాదు మహిళలు సహాయక సంఘాలను కనుగొనేందుకు, అపోహలను ఎదుర్కొనేందుకు, వారి జీవితాలను మార్చుకునేందుకు హెల్ప్ చేస్తుంది. దాదాపు 100 దేశాలల్లో పబ్లిష్ అయిన 'ది సెక్స్ లైవ్స్ ఆఫ్ ఆఫ్రికన్ ఉమెన్'.. సెనెగల్‌లో బహుభార్యత్వం, ఈజిప్ట్‌లో స్వలింగ సంపర్కుల ప్రేమ, ఇథియోపియాలో పిల్లలు లైంగిక వేధింపుల నుంచి స్వస్థత పొందడం, యునైటెడ్ స్టేట్స్‌లో ఆధ్యాత్మిక ప్రక్షాళన రూపంగా బ్రహ్మచర్యాన్ని ఎంచుకోవడం లాంటి ముఖ్యవిషయాలను ఉదహరించింది.

అపనమ్మకాలకు అసలైన జవాబు..

ఈ పుస్తకం చదివిన ఆఫ్రికన్ రచయితలు, సోషల్ మీడియా యూజర్స్.. సాన్నిహిత్యం, ప్రేమ, లింగ సమానత్వం గురించి ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. లైంగిక అణచివేత, సెక్సువల్ ఫ్రీడమ్‌లో ప్రాంతం, మతం పాత్రను ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పవర్‌ఫుల్ అండ్ నెసెసరీ మెసేజ్ ఆఫ్రికాకు అవసరమని, లైంగిక విముక్తి అనేది శ్వేతజాతీయులకే కాదు తమకూ చెందుతుందని చెప్తున్నారు. 'ఇక అనేక ఆఫ్రికన్ పాఠశాలలు, ఇళ్లల్లో సెక్స్ గురించి సంభాషణ సాధారణంగానే ప్రతికూలంగా ఉంటుంది. సెక్స్ చేస్తే చనిపోతారని, వ్యాధులకు దారితీస్తాయనే అపోహలతోనే ఈ తరం కూడా ప్రయాణం చేస్తుంది' కాబట్టి అలాంటి అపనమ్మకాలకు కూడా జవాబు చెప్తోందని ప్రశంసిస్తున్నారు.

స్వేచ్ఛను కొనసాగించే అవకాశం..

ఇక సెంట్రల్ నైరోబీలోని అలయన్స్ ఫ్రాంకైస్ థియేటర్‌లో తనకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఎమోషనల్‌గా మాట్లాడిన పుస్తక రచయిత సెకియామా.. 'మేము(ఆఫ్రికన్ మహిళలు) ఎప్పుడూ చాలా పరిమిత మార్గాల్లో చిత్రీకరించబడుతున్నాం. పనిలేని, దయనీయమైన, నిరంతరం గర్భవతులైన, HIV/AIDSతో బాధపడుతున్న వ్యక్తులుగా కనిపిస్తున్నాం. ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు నిజాలు ఈ ప్రపంచానికి తెలియదు. ఇప్పటి వరకు వైకల్యమున్న మహిళలు లేదా స్త్రీ జననేంద్రియ వికృతీకరణను అనుభవించిన వారు మళ్లీ సెక్స్‌ను ఆస్వాదించడం చూడాలనుకుంటున్నా. ఈ పుస్తకం మహిళలు స్వేచ్ఛను కొనసాగించే అవకాశాన్ని ఇస్తుందని ఆశిస్తున్నా' అని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed