- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్కౌట్స్ చేయడం కష్టమా..? రోజూ 30 నిమిషాల నడక చాలు!
దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఎంతో కొంత వర్కౌట్ చేయాల్సిందే. దీని కోసం చాలా మంది జిమ్‌కి వెళ్లి కష్టమైన వర్కౌట్‌లు చేస్తుంటారు. ఈ వర్కౌట్స్ కష్టం అనుకునే వారు.. ప్రతీ రోజూ కొంత సమయం నడిస్తే సరిపోతుందని నిపుణులు తెలుపుతున్నారు. రోజుకు కేవలం 30 నిమిషాలు నడవడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, డయాబెటిస్, రక్తపోటును నియంత్రించడంలో సహాయం పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ప్రతీ రోజు ఉదయం నడవడం వల్ల శరీరక ప్రయోజనాలు మాత్రమే కాకుండా మానసికంగా కూడా ప్రశాంతతను పొంతుతారని నిపుణులు చెబుతున్నారు.
ప్రతీ రోజు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
*గుండె సమస్యలకు చెక్: నడక మీ గుండెను బలపరచడమే కాకుండా.. రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
*కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: నడక మన శరీరంలోని అనవసరమైన కేలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఊబకాయం సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారు నడవడం వల్ల సమస్యని చాలా వరకూ తగ్గించవచ్చు.
*కీళ్ల నొప్పులు: ఈ రోజుల్లో చాలా మంది కీళ్ల నొప్పులతో బాధతుంటారు. కాళ్ళలోని జాయింట్స్‌లో జిగురు లాంటి పదార్థం తగ్గడం వల్ల ఈ కీళ్ళనొప్పులు వస్తుంటాయి. అయితే, ప్రతీ రోజూ వాకింగ్ చేయడం వల్ల లిక్విడ్ గమ్ పెరిగి కీళ్ళనొప్పులు దూరమవుతాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
*ఆయుష్షు పెరుగుతుంది: ప్రతీ రోజు నడక ఆయుష్షును పెంచుతుందని ఆధ్యయనాలు చెబుతున్నాయి. నడక వల్ల 16 నుంచి 20 సంవత్సరాలు అదనంగా జీవించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
ఎలా ప్రారంభించాలి?
*భోజనం తరువాత: భోజనం చేసిన తరువాత లేదా మీకు మీలున్న సమయంలో 10 నిమిషాలు నడకను అలవాటు చేసుకోండి. భోజనం తర్వాత నడక కండరాల గ్లూకోజ్ తీసుకోవడం పెంచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
*ఉదయం నడక: ఉదయాన్నే నడవడం వల్ల మెదడులో కణాలు సక్రమంగా పనిచేసి, టెన్షన్, ఆందోళన సంబంధిత సమస్యలు తగ్గిస్తాయి. దీని గుండె ఆరోగ్యంగా ఉండడమే కాకుండా, మెదకు చురుకుగా పనిచేస్తుంది.
*డ్రైవింగ్‌కి బదులు వాకింగ్: చాలామంది ఏదైనా అవసరం అయితే కొద్దిపాటి దూరానికి కూడా బైక్ లేదా కార్‌ని ఉపయోగిస్తుంటాం. ఈ చిన్న చిన్న ప్రయాణాల కోసం డ్రైవింగ్ చేయడానికి బదులుగా సాధ్యమైనంత వరకు వాకింగ్ చేయడం మంచిది.
Read More..