- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మధ్యాహ్న భోజనం తిన్న 9 మంది విద్యార్థులు అస్వస్థత
దిశ, దుబ్బాక : పురుగుల అన్నం, నీళ్ల చారు తో మధ్యాహ్న భోజనం పెడుతున్న ఎవరు పట్టించుకోవడం లేదంటూ.. విద్యార్థులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్న భోజనం తిని 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించిన సంఘటన మిరుదొడ్డి లో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి తొమ్మిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు పురుగుల అన్నం, నీళ్ల చారు పెడుతున్నారని విద్యార్థులు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
విద్యార్థులకు అన్నంలో పురుగులు రావడం తో పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. ప్రతిరోజు మధ్యాహ్న భోజనం విద్యార్థులు తినడానికి ఇష్టం చూపడం లేదని ఆరోపిస్తున్నారు. పాఠశాలలో మొత్తం 499 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ మధ్యాహ్న భోజనం మాత్రం రోజుకు 270 విద్యార్థులకు మాత్రమే ఉండటం జరుగుతుందని ఉపాధ్యాయులు వెల్లడించారు. నేడు 270 మందికి గాను కేవలం 150 మందికి మాత్రమే సరిపడా వంటకాలు చేయడంతో మిగతా విద్యార్థులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి భోజనాలు తెచ్చుకోవడం జరుగుతుందని తెలిపారు.
మధ్యాహ్న భోజన కార్మికులు సరైన పౌష్టికాహారం అందించడం లేదని గతంలోనే ఎంఈఓ కు ఫిర్యాదు చేసినట్లు ప్రిన్సిపాల్ భారతి తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఈవో ప్రభుదాస్ సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులచే ఆందోళన విరమింపజేశారు. విద్యార్థులకు సరైన భోజనం వడ్డించకపోవడం బాధాకరమన్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా చూస్తానని తెలిపారు. అస్వస్థకు గురైన విద్యార్థులకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించడం జరిగిందని తెలిపారు.