- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Har Ghar Tiranga Campaign: దేశరాజధానిలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ
న్యూఢిల్లీ : 750 Bikers took part in Bike Rally Under Har Ghar Tiranga Campaign| 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశరాజధానిలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. శనివారం ఉదయం హర్ తిరంగ్ యాత్ర ప్రచారంలో భాగంగా ఢిల్లీలో 750 మంది బైకర్లు జాతీయ పతకాలతో తిరంగ యాత్ర నిర్వహించారు. కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి తాలక్‌టోరా ఇండోర్ స్టేడియం వద్ద ఈ కార్యక్రమాన్ని పచ్చా జెండా ఊపి ప్రారంభించారు. ఆయనతో పాటు బీఎపీ ఎంపీ మజీందర్ సింగ్ సిర్సా పాల్గొన్నారు. బైకర్లు కాషాయ తలపాగాలు ధరించి ఇండియా గేట్ దగ్గర్లోని పాటియాలా హౌజ్ వరకు ర్యాలీగా వెళ్లారు. మరోవైపు అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్రమంత్రి వీకే సింగ్ 'రన్ టూ లక్నో' ఫిట్ ఇండియా క్యాంపెయిన్ ప్రారంభించారు. ప్రతి రోజు అధికారులు 75 కిలోమీటర్లు పరిగెత్తనున్నారు. 10 రోజుల్లో 750 కిలోమీటర్లు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: దేశవ్యాప్తంగా తగ్గిన స్కూల్ డ్రాపౌట్ రేటు