భోపాల్‌లో ఆరుగురు ఉగ్రవాదులు అరెస్ట్!

by Manoj |
భోపాల్‌లో ఆరుగురు ఉగ్రవాదులు అరెస్ట్!
X

భోపాల్: ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఆరుగురిని మధ్యప్రదేశ్ భోపాల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ల్యాప్ ట్యాప్, మత పరమైన రచనలు కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఉగ్రవాద వ్యతిరేక, కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజేన్సీలు ఈ అపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు.

వీటిలో ఒక ఇళ్లు పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే ఉన్నట్లు వెల్లడించారు. అరెస్ట్ చేసిన వారిలో ఇద్దరిని అహ్మద్, ముఫ్తీలుగా గుర్తించినట్లు తెలిపారు. గత మూడు నెలలుగా ఎలాంటి ఒప్పందం లేకుండా అద్దెకు ఉంటున్నట్లు చెప్పారు. ఆదివారం ఉదయం 3 గంటలకు దాదాపు 60 పోలీసు సిబ్బంది బిల్డింగ్‌ను చుట్టుముట్టినట్లు స్థానికులు తెలిపారు. తాళం వేసి ఉండడంతో తుపాకితో పేల్చినట్లు చెప్పారు.





Advertisement

Next Story

Most Viewed