చరిత్రను తిరగరాసిన మార్చి.. 122 ఏళ్ల భారత రికార్డ్ బ్రేక్

by Javid Pasha |
చరిత్రను తిరగరాసిన మార్చి.. 122 ఏళ్ల భారత రికార్డ్ బ్రేక్
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో గత 122 ఏళ్ల ఉన్న రికార్డును 2022 మార్చి నెల బ్రేక్ చేసింది. ఎన్నడూ లేనంత సమ్మర్ హీట్ ఈ నెలలోనే నమోదైంది. 2022 మార్చి భారత దేశ 122 ఏళ్ల చరిత్రలో అత్యంత ఉష్ణోగ్రత నమోదైన నెలగా అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు మార్చి నెలలో నమోదైన అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత 2010లో 33.09 సెల్సియస్. ఈ రికార్డును 2022 మార్చి 33.1 డిగ్రీల సెల్సియస్‌తో బ్రేక్ చేసింది. దీంతో ఇప్పటి వరకు మార్చి నెలకు ఉన్న రికార్డును ఈ నెల బ్రేక్ చేసిందని భారత వాతావరణ శాఖ అధికారికంగా వెళ్లడించింది. అంతేకాకుండా 2020 మార్చి నెల ఇప్పటివరకు రెండో హాటెస్ట్ నెలగా ఉందని, ఇప్పుడు మొదటి స్థానానికి 2022 మార్చి రావడంతో 2020 మార్చి మూడవ స్థానానికి పడిపోయిందని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed