అగని గని ప్రమాదాలు.. ఇద్దరు కార్మికులకు గాయాలు

by S Gopi |
అగని గని ప్రమాదాలు.. ఇద్దరు కార్మికులకు గాయాలు
X

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే న్యూటెక్ గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. గనిలో 1 ఏ సిమ్ 13వ ప్యానెల్ వద్ద డీపిల్లరింగ్ నడుస్తుండగా సైడ్ ఫాల్ శబ్ధాలు రావడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. దీంతో సైడ్ వాల్ పాల్ అయ్యి ఇద్దరు కార్మికులు సురేష్ ( ఎలక్ట్రియన్), శ్రీనివాస్ (జనరల్ మద్దూర్)కు గాయాలు అయ్యాయి. హుటాహుటిన అధికారులు స్పందించి గాయపడిన కార్మికులను రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి తరలించారు. భయంతో పరుగులు తీసే క్రమంలో సురేష్ ఎస్ డి ఎల్ యంత్రాన్ని ఢీకొనిగా, శ్రీనివాస్ టబ్బులకు తగిలి కింద్ర పడినట్టు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story