సెక్సువల్ హెల్త్ కోసం 12 సూపర్ ఫుడ్స్.. సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర

by Javid Pasha |   ( Updated:2022-03-16 02:49:42.0  )
సెక్సువల్ హెల్త్ కోసం 12 సూపర్ ఫుడ్స్.. సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర
X

దిశ, ఫీచర్స్ : పిల్లలను కనాలనుకునే తల్లిదండ్రుల విషయంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. హెల్తీ డైట్‌తో పాటు పలు అనారోగ్యకర ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రెడ్ మీట్, ఫ్రైడ్ డిషెస్, తీపి పానీయాలు, డెజర్ట్‌లు ఎక్కువగా తినే పురుషులతో పోలిస్తే పండ్లు, కూరగాయలు, చేపలు, చికెన్‌ వంటి ప్రొటీన్ ఫుడ్ తీసుకునే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా ఉంటుందని 'హార్వర్డ్ TH చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్' స్టడీ వెల్లడించింది. అందుకే సంతానం కోసం ప్లాన్ చేస్తున్న తల్లిదండ్రులు ఇక్కడ తెలిపిన సూపర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందవచ్చని నోవా IVF, పుణెకు చెందిన ఫెర్టిలిటీ కన్సల్టెంట్ తెలిపారు.

గుడ్లు : ప్రొటీన్, 'విటమిన్ ఇ'తో నిండి ఉండే గుడ్లు స్పెర్మ్ కౌంట్‌ను, చలనశీలతను మెరుగుపరుస్తాయి. అంతేకాదు వీర్యకణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. అయితే నిపుణులు సూచించిన పరిమాణంలోనే తినేందుకు ప్రయత్నించాలి. మోతాదుకు మించి తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎదురవచ్చు.

ఆస్పరాగస్ : ఇందులో స్పెర్మ్ హెల్త్‌కు అవసరమైన 'విటమిన్ సి' ఉంటుంది. ఈ గ్రీన్ వెజిటేబుల్‌‌ను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల వీర్య కణాల సంఖ్య సహజంగానే వృద్ధి చెందుతుంది. అంతకన్నా మించి ఇది ఫ్రీ-రాడికల్ డ్యామేజ్ నుంచి స్పెర్మ్‌ను కాపాడుతుంది గనుక అంతిమంగా కౌంట్ పెరగడంతో పాటు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బెర్రీస్ : స్ట్రాబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, రాస్ప్‌బెర్రీస్, క్రాన్‌బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ నుంచి అవసరమైన రక్షణను అందించి ఆరోగ్యకరమైన, బలమైన స్పెర్మ్‌ కౌంట్‌కు సాయపడతాయి.

అరటిపండు : మెగ్నీషియంతో పాటు విటమిన్లు 'బి1, సి' పుష్కలంగా ఉండే అరటిపండును ఆహారంలో భాగం చేసుకుంటే స్పెర్మ్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇక అరటిపండులోని 'బ్రోమెలైన్' ఎంజైమ్.. స్పెర్మ్ చలనశీలతకు హెల్ప్ చేస్తుంది.

పాలకూర/వెల్లుల్లి : పాలకూరలో స్పెర్మ్ ప్రొడక్షన్‌ను పెంచే ఫోలిక్ యాసిడ్ ఉండగా.. వెల్లుల్లిలోని 'సెలీనియం' అనే ఎంజైమ్ స్పెర్మ్ చలనశీలతను మెరుగుపరుస్తుంది.

దానిమ్మ/టమోటా : దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తప్రవాహంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి స్పెర్మ్‌ పాడవకుండా కాపాడతాయి. ఇక టమోటాల్లోని విటమిన్ సి, లైకోపీన్‌ సైతం స్పెర్మ్ కౌంట్‌ను పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

డార్క్ చాక్లెట్/గుమ్మడికాయ గింజలు : డార్క్ చాక్లెట్‌లోని 'ఎల్-అర్జినైన్' అనే ఎంజైమ్ స్పెర్మ్ వాల్యూమ్‌ను పెంచగలదు. ఇక గుమ్మడికాయ గింజలు పునరుత్పత్తి ఆరోగ్యం విషయంలో అద్భుతాలు సృష్టిస్తాయి. ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోస్టెరాల్స్‌తో పాటు స్పెర్మ్ వైరలిటీని పెంచే అమైనో ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

క్యారెట్లు/వాల్‌నట్స్: క్యారెట్లలో లభించే బీటా కెరోటిన్.. ఫ్రీ రాడికల్స్ ద్వారా స్పెర్మ్ దెబ్బతినకుండా నిరోధించేందుకు అవసరమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. కాగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ను కలిగిఉండే వాల్‌నట్స్ స్పెర్మ్‌ చలనశీలతను పెంపొందిస్తాయి.

Advertisement

Next Story

Most Viewed