పంజాబ్‌లో కాంగ్రెస్ మ్యానిఫెస్టో.. అధికారంలోకి వస్తే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు

by Web Desk |
పంజాబ్‌లో కాంగ్రెస్ మ్యానిఫెస్టో.. అధికారంలోకి వస్తే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు
X

ఛంఢీగఢ్: పంజాబ్‌లో తాము మరోసారి అధికారంలోకి వస్తే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పేర్కొంది. ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర చీఫ్ నవజ్యోతి సింగ్ సిద్ధూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

గురునానక్‌ను స్ఫూర్తిగా తీసుకుని మ్యానిఫెస్టోను రూపొందించినట్లు తెలిపారు. 'సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎవరైనా పైలట్ కావచ్చు. కానీ తుఫాను వచ్చినప్పుడు, మనం కష్టాలను అవకాశంగా మార్చుకోగలగాలి' అదే ఈ మ్యానిఫెస్టో లక్ష్యమని అన్నారు. అధికారంలోకి తొలి ప్రాధాన్యంగా లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. దీంతో పాటు మహిళలకు ప్రతి నెలా రూ.1,100తో పాటు, ఏడాదికి ఎనిమిది ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని చెప్పారు.

ఉచిత విద్య, యువత నైపుణ్య శిక్షణ తో పాటు వ్యవస్థాపకులుగా మార్చుతామన్నారు. అంతేకాకుండా అర్బన్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ మిషన్ ద్వారా రాబోయే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. దీంతో పాటు వ్యసన విముక్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మద్యం, ఇసుక అమ్మకాలపై ప్రత్యేక వ్యవస్థతో పాటు మాఫియాను అంతం చేస్తామని చెప్పారు. అంతేకాకుండా రైతుల నుంచి నూనె గింజలు, పప్పులు, మొక్కజొన్నలు సేకరిస్తామని అన్నారు. 13 పాయింట్ల ఎజెండా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ముందుచూపును ప్రతిబింబిస్తోందని సిద్ధూ పేర్కొన్నారు.

Advertisement

Next Story