- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mamata Banerjee: ప్రభుత్వాలు గెలిచినా.. ప్రజల మనసులు గెలవలేరు : సీఎం మమతా బెనర్జీ
కోల్‌కతా: Mamata Banerjee Says, Maharashtra Government Under BJP-Shinde will fall Soon| పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ-షిండే బృందం ప్రభుత్వాన్ని ఏర్పరచడంపై స్పందిస్తూ వారు ప్రభుత్వాన్ని గెలుచుకున్న ప్రజలు మనసును గెలుచుకోలేరని విమర్శించారు. కోల్‌కతాలో నిర్వహిస్తున్న 'ఇండియా టుడే ఐదవ ఎడిషన్ ఈస్ట్ సదస్సు' ప్రారంభ కార్యక్రమంలో సోమవారం ఆమె మాట్లాడారు. మహా ప్రభుత్వం కొనసాగదని నేను నమ్ముతున్నాను. ఇది విలువల్లేని అప్రజాస్వామ్యక ప్రభుత్వం. వారు ప్రభుత్వాన్ని గెలుచుకున్నప్పటికీ, మహారాష్ట్ర ప్రజల మనసులను మాత్రం గెలుచుకోలేరు' అని అన్నారు.
బీజేపీ అధికారాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నదని, కానీ దేశ ప్రజలు వారిని కూల్చి ప్రజాస్వామ్యానికి అర్థం చెబుతారని చెప్పారు. డబ్బు, ఇతర అంశాలతో బీజేపీ వారిని అసోంలో మభ్యపెట్టిందని విమర్శించారు. నేతలు రెండు సార్లు ఎన్నికవడం దేశానికి హనికరమా? అని ప్రశ్నించారు. దేశాన్ని యువత పాలించాలని మీరు కోరుకోవడం లేదా అని బీజేపీని ప్రశ్నించారు. కొందరు బీసీసీఐలో ఉన్నతస్థాయిలో ఉంటే కుటుంబ పాలన గుర్తురాదని, కేవలం రాజకీయాల్లో ఉంటేనే ఎత్తి చూపుతారని కేంద్రమంత్రి అమిత్ షానుద్దేశించి అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు నిరసనలతో ఓట్లు వేస్తారని చెప్పారు. ప్రజలు ఓ పార్టీని ఎంచుకుని కాకుండా, బీజేపీని తిరస్కరించేందుకే ఓటు వేస్తారని ఉద్ఘాటించారు. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ ప్రతినిధి నుపూర్ శర్మను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో రగులుతున్న జ్వాలలతో ఆడుకోవద్దని సూచించారు.
- Tags
- Mamata Banerjee