- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Konda Vishweshwar Reddy: ఆ దమ్ము బీజేపీకే ఉంది.. కేసీఆర్‌పై కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం
దిశ, వెబ్‌డెస్క్: చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొండా విశ్వేశ్వరరెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా కొండా మాట్లాడుతూ.. 'నేను బీజేపీలో చేరే విషయం కాంగ్రెస్ నేతలందరికీ తెలుసు.. కాంగ్రెస్‌ని వీడిన నాటినుంచి ఎవరూ పట్టించుకోలేదు. ఇన్ని రోజులు నేను న్యూట్రల్ గానే ఉన్నా.. ఇప్పుడు బీజేపీలో చేరే సరికి అందరూ అడుగుతున్నారని' అన్నారు.అలాగే కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులకు కూడా బీజేపీలో చేరుతున్న విషయం తెలుసన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ను అడ్డుకునే శక్తి కేవలం బీజేపీ కే సాధ్యం అన్నారు. అలాగే కాంగ్రెస్ లో ఉన్నవారిలో కోమటిరెడ్డి బ్రదర్సే నయం అని చెప్పుకొచ్చారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ నేతలు వివిధ పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు మూడు అస్త్రాలు వినియోగిస్తున్నారు. పార్టీలో చేరడానికి ఒకరు కాళ్ళు మొక్కుతారు, ఒకరు డబ్బులిస్తారు, ఇంకొకరు కేసులతో గల్లా పట్టి బెదిరిస్తారని బీజేపీలో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.