ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎంతో చేస్తోంది.. ప్రాంతీయ పార్టీల విమర్శలు సరికాదు!

by Web Desk |
ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎంతో చేస్తోంది.. ప్రాంతీయ పార్టీల విమర్శలు సరికాదు!
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ విభజన శాస్త్రీయంగా జరగలేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మరోసారి ఆరోపించారు. విభజన ప్రక్రియ అంతా అప్రజాస్వామికంగా జరిగిందని ఆరోపించారు. ఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అంశంలో నాడు కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని తప్పుబట్టారు. అయితే ఈ విషయంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీపై కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు.

కేంద్రంపై నిందలు వేసి తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలు ప్రచారం చేసే పార్టీలు చర్చకు సిద్దంగా ఉండాని ఆయన సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సహాయాన్ని వివరించారు.

ఏపీకి 2015 -16 లో రూ. 27,990 కోట్ల నిధులిస్తే 2020-21 మూడు రెట్లు అధికంగా అంటే రూ. 77,538 కోట్లు ఇచ్చి కేంద్రం అనుకున్న విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనని నిధులు ఏపీకి మాత్రమే ఇచ్చామనిచెప్పుకొచ్చారు. అంతేకాదు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 15 వేల కోట్ల రుణాన్ని కేంద్రం చెల్లిస్తోందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed