- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రెక్కింగ్‌తో అదరగొట్టిన 62ఏళ్ల బామ్మ!
దిశ, ఫీచర్స్: ట్రెక్కింగ్, హైకింగ్, ఎక్స్‌ప్లోరింగ్ వంటి సాహసాలకు యువత ముందుంటుందన్న విషయం తెలిసిందే. శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ వృద్ధులైతే ఇలాంటి అడ్వెంచర్స్‌కు అస్సలు సాహసించరు. కానీ బెంగళూరుకు చెందిన 62 ఏళ్ల నాగరత్నమ్మ మాత్రం కేరళ రాష్ట్రంలోనే రెండో ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి, వయసు కేవలం ఒక సంఖ్యేనని నిరూపించింది. ఆమె ట్రెక్కింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
సహ్యాద్రి పర్వత శ్రేణిలోని ఎత్తయిన కొండల్లో ఒకటైన 'అగస్త్యర్‌కూడమ్(1862 మీటర్లు)'పైకి సులభంగా రోప్ క్లైంబింగ్ చేసి ఔరా అనిపించింది నాగరత్నమ్మ. ఈ మేరకు తొలిసారి ట్రెక్కింగ్ చేసిన తను.. కొడుకు, అతడి స్నేహితులతో కలిసి చీరకట్టులోనే ఈ ఫీట్ పూర్తి చేయడం విశేషం. ఇక నాగరత్నమ్మ పర్వతాన్ని అధిరోహించిన వీడియో చూసినవారందరిలోనూ స్ఫూర్తిని, ఉత్తేజాన్ని నింపుతుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
కాగా 'పెళ్లయ్యాక 40 ఏళ్లుగా కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉన్నాను. ఇప్పుడు నా పిల్లలందరూ స్థిరపడ్డారు. అందుకే నా కలలను నెరవేర్చుకోవాలనుకున్నాను. నాలో శక్తి, ఉత్సాహం ఉన్నంతవరకు నచ్చిన పనులు చేస్తాను' అని నాగరత్నమ్మ పేర్కొంది. ఇక నాగరత్నమ్మ కంటే ముందు.. కేరళ, పాలక్కాడ్‌లోని ఒక పార్కులో 72 ఏళ్ల వృద్ధురాలు నిర్భయంగా జిప్ లైనింగ్ చేసి అభినందనలు అందుకుంది