- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలుగుదేశం పార్టీ కాదు.. తెలంగాణ దేశం పార్టీ

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్‌కు లేఖ రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ లేఖ వెనుక చంద్రబాబు ప్రోద్బలం ఉందని అనిల్ ఆరోపించారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో భయపడుతున్నారని.. అందువల్లే తెలంగాణ ప్రాజెక్టులపై నోరెత్తడంలేదని విమర్శించారు.
ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే టీడీపీ ‘తెలంగాణ దేశం పార్టీ’గా మారిపోయిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుది ఎప్పుడూ రెండు కళ్ల సిద్ధాంతమేనని మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు. ప్రాంతాలు, కులాలు మధ్య చిచ్చుపెడుతుంది కూడా టీడీపీయేనని ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రాజెక్టును ఆపేయాలంటూ డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాయడం ఆ కోవలోకే వస్తుందని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు.