- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలుగు రాష్ట్రాలు కేంద్రాన్ని ఎదిరించాలి: సీపీఐ(ఎం)
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రధాని మోడీ విధానాలను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురించాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వడ్లు కొనేందుకు కేంద్రం కుంటి సాకులు చెబుతోందని, పండిన ధాన్యం మొత్తాన్ని కేంద్రం ఎఫ్‌సీఐ ద్వారా కొనేలా చేయాలని డిమాండ్‌చేశారు. రాఫెల్యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాలపై న్యాయవిచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతు పోరాటానికి, ప్రైవేటీకరణ, మానిటైజేషన్‌కు వ్యతిరేకంగా ప్రజలు, రైతులు, కార్మికులు చేస్తున్న ఆందోళనలకు సంఘీభావం ప్రకటించారు. కేంద్రం వసూలు చేస్తున్న ప్రత్యేక పన్నులను రద్దు చేసి పెట్రోల్, డీజిల్‌ధరలు తగ్గించాలని డిమాండ్‌చేశారు. బీజేపీ సర్కార్‌పై టీఆర్ఎస్చేస్తున్న విమర్శలు ఆహ్వానించదగినవేనని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది జనవరి 7 నుంచి 9వ తేదీ వరకు కేంద్ర కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశ రాజకీయ పరిణామాలపై చర్చించి పార్టీ వ్యూహాన్ని రూపొందిస్తామని ఆయన తెలిపారు.