మాతృభూమికి అండగా తెలుగు కళా సమితి ఆఫ్ బహెరిన్..

by Shamantha N |
మాతృభూమికి అండగా తెలుగు కళా సమితి ఆఫ్ బహెరిన్..
X

బహెరిన్ : బహెరిన్ దేశంలోని తెలుగు వారి సాంఘిక సంస్థ తెలుగు కళా సమితి కరోనా కష్ట సమయంలో మాతృభూమికి అండగా నిలిచింది. ఇక్కడి ఇండియన్ ఎంబసీ పిలుపు మేరకు దాదాపు రెండు లక్షల రూపాయలు విలువ చేసే ఆక్సిజెన్ సిలిండర్లు అందించింది.

ఇండియన్ ఎంబసీ నేతృత్వంలో తెలుగు కళా సమితితో పాటు ఇతర సంస్థలు, వ్యక్తుల సహకారంతో సమకూర్చిన 760 ఆక్సిజెన్ సిలిండర్లు, 10 ఆక్సిజెన్ కాన్సెంట్రేటర్లతో భారతీయ నావికా దళ నౌక ఐఎన్‌యెస్ తారకాష్ మే 20వ తేదీన బహెరిన్ నుండి బయలు దేరింది. తెలుగు కళా సమితి గౌరవ అధ్యక్షులు శివ ఎల్లపు మాట్లాడుతూ.. తమ సభ్యుల సహకారంతో ఈ కరోనా కష్ట సమయంలో తమ వంతు సహకారాన్ని అందించ గలిగామని చెప్పారు. మాతృ భూమి సేవకై తెలుగు కళా సమితి ఎప్పుడూ ముందు ఉంటుందని చెప్పారు.

Advertisement

Next Story