టెలీ మెడిసిన్ వైద్య సేవలు షురూ

by Shyam |
టెలీ మెడిసిన్ వైద్య సేవలు షురూ
X

దిశ, మహబూ‌బ్‌నగర్: మక్తల్ మండలంలోని పలు గ్రామాల్లో టెలి వైద్యసేవలు ప్రారంభమయ్యాయి. రోగి డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే గ్రామంలోని ఉంటూ వైద్య సేవలు పొందడం ఈ కార్యక్రమ ఉద్దేశం. దేశంలో మారుమూల గ్రామాల్లో వైద్య సేవలు అందక చనిపోతున్న ఘటనలకు పులి స్టాప్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం టెలీ మెడిసిన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మక్తల్ మండలాన్ని ఎంపిక చేశారు.

ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పంచాయతీ సెక్రెటరీ‌లకు ఈ సేవలకు సంబంధించిన శిక్షణ ఇచ్చారు. వారు తమ ఫోన్‌లో యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటారు. తను పనిచేస్తున్న పంచాయితీలో ఎవరైనా అనారోగ్యానికి గురైతై వారి వ్యాధి వివరాలను ఆ యాప్‌లో సెక్రెటరీలు నమోదు చేస్తారు. ఇక..ఆ తర్వాత ఆ వ్యాధికి సంబంధించిన సీనియర్ డాక్టర్ అందుబాటులోకి వస్తారు. వీడియో కాల్‌లో రోగితో సంభాషించి రోగ నిర్ధారణ చేసి మందులు రాసి మెసేజ్ పంపిస్తారు. మందులను ప్రభుత్వం ప్రారంభించిన జనరిక్ మందుల షాపు‌లో తీసుకుని వాడాల్సి ఉంటుంది.

సాధారణ జబ్బులకు మాత్రమే..

టెలీ మెడిసిన్ వైద్యం సాధారణ జబ్బులకు మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రస్తుతం కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో గ్రామాల్లో వ్యక్తులు గ్రామం దాటకుండానే పంచాయతీ సెక్రెటరీతో యాప్ ద్వారా రోగనిర్ధారణ మెసేజ్ పంపాల్సి ఉంటుంది. దాన్ని రిసీవ్ చేసుకున్న డాక్టర్లు అందుబాటులోకి వచ్చి వైద్య సేవలు అందిస్తారు. ఈ వైద్య సేవలు మారుమూల గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags: Tele Medicine Services, helpful, people, doctors, palamuru

Advertisement

Next Story