ఖర్గేను కలిసిన వివేక్ వెంకటస్వామి.. కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2023-11-02 10:46:55.0  )
ఖర్గేను కలిసిన వివేక్ వెంకటస్వామి.. కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. అనంతరం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ‘ఉద్యమ సమయంలో తెలంగాణ సాధన కోసం ముందడుగు వేశాం. అందరి సమిష్టి కృషితో వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. కుటుంబ పాలన, అవినీతి పాలనతో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారు. నాలుగేళ్లుగా కేసీఆర్ రాక్షస పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశా. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

కమీషన్ల కోసమే రీ డిజైన్ చేశారు. కేసీఆర్‌ను ఓడించాలని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు. మల్లికార్జున ఖర్గే ఆశీస్సులు తీసుకున్నా. కాంగ్రెస్‌లో చేరి కేసీఆర్ రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించేందుకు కృషి చేస్తా. బీజేపీలో నాలుగేళ్ల క్రితం ఎలా ఉందో నేను చేరాక ఎలా ఉందో ప్రజలకు తెలుసు. కేసీఆర్‌ను ఓడించేందుకే పార్టీ మారాను. ఎన్నికల్లో పోటీ అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది.’ అని వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story