- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Revanth Reddy : సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ విజయం కాంగ్రెస్‌దే అని అన్నారు. రైతుల కోసం నిర్విరామంగా కొట్లాడింది తామే అని వెల్లడించారు. రాష్ట్రంలో కేసీఆర్ లిక్కర్ కింగ్‌లా మారారని మండపడ్డారు. తాను చంద్రబాబు, కిషన్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి శిష్యులం అయితే.. కేసీఆర్ కుల గురువు చార్లెస్ శోభరాజ్ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చార్లెస్ శోభరాజ్ అంతర్జాతీయ ఆర్థిక నేరగాడిగా, దొంగగా ఏ రకంగా పేరు తెచ్చుకున్నాడో.. దేశ ముఖ్యమంత్రుల్లో అత్యంత అవినీతి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేరు తెచ్చుకున్నాడని ఆరోపిచారు. మద్యం దుకాణాల లైసెన్స్‌దారుల నోటిఫికేషన్‌పైనా రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సర్కార్ లిక్కర్ మీద ఆధారపడి నడుస్తుంది కాబట్టే ఎన్నికల వేళ అబ్కారీ శాఖ దరఖాస్తులను స్వీకరించడానికి సిద్ధమైందని మండిపడ్డారు.