కేసీఆర్ కుటుంబానిదే బాధ్యత: రేవంత్ రెడ్డి

by GSrikanth |   ( Updated:2023-11-13 10:37:24.0  )
కేసీఆర్ కుటుంబానిదే బాధ్యత: రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన ప్రతీ అవినీతికి కేసీఆర్ కుటుంబానిదే బాధ్యత అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ ప్రాజెక్టు బలైందని ఇవాళ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే ధర్మపురి ప్రాంతానికి నిధులు వచ్చాయని, అభివృద్ధి జరిగిందన్నారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో మార్పు కావాలంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story