HYD: మజ్లీస్​ కార్యకర్తలకు గుడ్ న్యూస్.. కేసు వెనక్కి తీసుకున్న పోలీసులు

by GSrikanth |   ( Updated:2023-11-05 13:52:08.0  )
HYD: మజ్లీస్​ కార్యకర్తలకు గుడ్ న్యూస్.. కేసు వెనక్కి తీసుకున్న పోలీసులు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: కారులో వెళుతుండగా అడ్డగించి తనపై దాడికి యత్నించారంటూ కార్వాన్​నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​టిక్కెట్​ఆశిస్తున్న ఉస్మాన్​బిన్ మహ్మద్​అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మజ్లీస్​కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను లంగర్​హౌస్​పోలీసులు వెనక్కి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించినపుడు మజ్లీస్​కార్యకర్తలు ఎలాంటి గొడవ చేయలేదని స్పష్టమైన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. త్వరలోనే జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీ నుంచి కార్వాన్​అసెంబ్లీ స్థానానికి ఉస్మాన్​బిన్​మహ్మద్​అలీ ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా పెన్షన్​పురా గోల్డెన్​జూబ్లీ హైస్కూల్​ప్రాంతం నుంచి తాను కారులో వెళుతుండగా కొందరు మజ్లీస్​కార్యకర్తలు అడ్డుకుని దాడికి ప్రయత్నించారంటూ ఉస్మాన్​బిన్​మహ్మద్​అలీ శనివారం లంగర్​హౌస్​పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ మేరకు పోలీసులు ఐపీసీ 341, 506, 209 రెడ్​విత్​34 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. విచారణలో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఉస్మాన్​బిన్​మహ్మద్​అలీ కారులో వెళుతుండగా అక్కడ ఉన్న కొందరు మజ్లీస్​కార్యకర్తలు తాము నిలబడ్డ చోటు నుంచే మజ్లీస్​జిందాబాద్​అని నినాదాలు మాత్రమే చేసినట్టుగా స్పష్టమైంది. ఉస్మాన్​బిన్​మహ్మద్​అలీ తనంతట తానుగా కారు దిగి వారి వద్దకు వెళ్లి మాట్లావినట్టు వెల్లడైంది. ఈ క్రమంలో మజ్లీస్​కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను మిస్టేక్​ఆఫ్​ఫ్యాక్ట్​అంటూ లంగర్​హౌస్​పోలీసులు వెనక్కి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed