ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌కు హైకమాండ్ BIG షాక్

by GSrikanth |   ( Updated:2023-08-20 09:03:22.0  )
ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌కు హైకమాండ్ BIG షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. 39 మందితో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జాబితాను ఆదివారం విడుదల చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డికి చోటు కల్పించారు. అంతేకాదు.. ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లంరాజు, వంశీచందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. శాశ్వత ఆహ్వానితులుగా సుబ్బిరామిరెడ్డి, కొప్పులరాజు, రామోదర రాజనర్సింహాలను నియమించారు. అయితే, ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టి.. రాష్ట్ర నేతలకు అవకాశం కల్పించి ఉత్సాహం నింపాల్సిన హైకమాండ్ మొండిచెయ్యి ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story