జర్నలిస్టులకు గుడ్‌ న్యూస్.. తెలంగాణ కాంగ్రెస్ కీలక హామీ

by GSrikanth |   ( Updated:2023-10-21 12:00:58.0  )
జర్నలిస్టులకు గుడ్‌ న్యూస్.. తెలంగాణ కాంగ్రెస్ కీలక హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా తామే ఇళ్లు కూడా కట్టించి ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రణాళికలో జర్నలిస్టుల ఇంటి స్థలం అంశాన్ని పొందుపరుస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజే హెచ్ ఎస్) అధ్యక్షుడు బొల్లోజు రవి, ట్రెజరర్ చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు ప్రతాప్ రెడ్డి, నాగరాజు తదితరులు గాంధీభవన్లో శ్రీధర్ బాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, జర్నలిస్టులకు మంచి రోజులు వస్తున్నాయని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులతోనూ డీజేహెచ్ఎస్ బృందం ఈ విషయంపై చర్చించిన విషయం తెలిసిందే.

గతంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కవిత తదితరులను కలిసి విన్నవించారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తోను ఈ విషయంపై వినతిపత్రం సమర్పించింది.ఈ సందర్భంగా డీజేహెచ్ఎస్ అధ్యక్షుడు బొల్లోజు రవి మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాదులో మొదటగా డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఏర్పడిందని పేర్కొన్నారు. హైదరాబాదులో పని చేసే జర్నలిస్టులు ఇంటి స్థలానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో జర్నలిస్టులందరినీ ఆదుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Next Story