యుద్ధానికి సిద్ధమైన తెలంగాణ కాంగ్రెస్.. ఎలక్షన్ స్లోగన్ ఖరారు

by GSrikanth |   ( Updated:2023-08-12 13:56:22.0  )
యుద్ధానికి సిద్ధమైన తెలంగాణ కాంగ్రెస్.. ఎలక్షన్ స్లోగన్ ఖరారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసింది. ప్రజల్లోకి వెళ్లేందుకు పదునైన ప్రణాళికతో ముందుకు వెళ్లనున్నది. ఈ మేరకు బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో ప్రణాళికను రెడీ చేసింది. ప్రభుత్వ వైఫల్యాలను జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ‘తిరగబడదాం..తరిమి కొడదాం’ అనే నినాదంతో వెళ్లనున్నారు. ఈ సభ నుంచే అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. అన్ని సెగ్మెంట్‌లలో ప్రజా కోర్టులు ఏర్పాటు చేసి.. సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ప్రజా యుద్ధానికి తెలంగాణ సిద్ధం అని మద్దతు తెలిపేందుకు 766189189 కు మిస్ట్ కాల్ ఇవ్వాలని పార్టీ ప్రకటించింది.

ప్రభుత్వ వైఫల్యాలపై నిర్వహించే ఈ ప్రచారంలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేసేందుకు సహకరించాలని పార్టీ కోరింది. ఐడియాలజీ సెంటర్‌లో మొదలైన ఈ సభలో ప్రజా గాయకుడు గద్దర్, సియాసత్ ఎడిటర్ జహీర్ అలీఖాన్‌లకు లీడర్లు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ సెక్రెటరీలు, సంపత్ కుమార్, వంశీ చంద్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, బలరాం నాయక్, సీతక్క, మల్లు రవి ఇతర కాంగ్రెస్ నేతలు, ప్రొఫెసర్ కంచె ఐలయ్య తదితరులు హాజరయ్యారు.

Advertisement

Next Story