- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిరుద్యోగులకు RS ప్రవీణ్ కుమార్ కీలక పిలుపు
దిశ, తెలంగాణ బ్యూరో: నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన దోపిడీ దొంగల పాలను బుద్ది చెప్పాలంటే వచ్చే బహుజనుల రాజ్యానికి మద్దతుగా నిలవాలని తెలంగాణ బీఎస్పీ చీఫ్ RS ప్రవీణ్ కుమార్ ట్వీటర్ వేదికగా పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో తమకు అన్యాయం జరిగిందని నిరుద్యోగ అభ్యర్థులు విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిస్తే వారిని పోలిసులు అరెస్ట్ చెయ్యడం అప్రజాస్వామికమని ఖండించారు. డీఎడ్, బీఎడ్ అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. నిరుద్యోగ అభ్యర్థులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ సంఘీభావంగా ఉంటుందన్నారు.
రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దె దించితేనే నిరుద్యోగ బిడ్డలకు న్యాయం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా 13 వేల పోస్టులని చెప్పి, ఇప్పుడు 5 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. ఈ అంశం గూర్చి అడగాలంటే ఎవరు అందుబాటులో లేరని విద్యా మంత్రి ఒక మాట, సీఎం ఒక మాట మాట్లాడుతున్నారని అన్నారు. ఇక ఎమ్మెల్యేలు అందుబాటులో లేరన్నారు. నిరుద్యోగులు తమ సమస్య ఎవరికీ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి తెలంగాణాలో నెలకొందని విమర్శించారు. ఎవరు అడిగినా పోలీసులతో దాడులు చేస్తూ అణిచివేస్తున్నారని ఆరోపించారు.