- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బహుశా వాడు కేటీఆర్ లాంటోడే అయ్యుంటాడు: RS ప్రవీణ్ కుమార్
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని బుధవారం కరీంనగర్ సభలో కేటీఆర్ హామీలు ఇచ్చారు. దీనిపై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కమార్ ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించి తీవ్ర విమర్శలు చేశారు. ‘కన్న తల్లికి అన్నం పెట్టనోడు.. పినతల్లికి బంగారు గాజులు చేపిస్తా అని ఎనకట ఎవడో అన్నాడట.. వాడు బహుశా కేటీఆర్ లాంటోడే అయ్యుంటాడు’ అని ఎద్దేవా చేశారు. ‘తొమ్మిది ఏళ్లు అధికారంలో ఉండి జాబ్ క్యాలెండర్ ప్రకటించలేనోడు.. లక్ష ఉద్యోగాలు కూడా సరిగా భర్తీ చేయలేనోడు..
తన పీఏను మధ్యవర్తిగా పెట్టి 16 పేపర్లు లీకు చేసి కోట్ల రూపాయలకు అమ్ముకున్నోడు.. 35 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టి నోడు.. బీఆర్ఎస్ పార్టీకి మూడోసారి అధికారం ఇస్తే, టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తాడట! నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తాడట! ఇంతకంటే దిగజారుడు మాటలు, నీచ రాజకీయాలు మరెక్కడా ఉండవు. జనార్దన రెడ్డిని రక్షిస్తున్నదెవరు? ఎన్నికల ముందు "ఓట్ల" కోసం కేసీఆర్, కేటీఆర్ ఇచ్చే మోసపూరిత హామీలు, ఆచరణ సాధ్యంకాని వాగ్ధానాలను నమ్మకండి. నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో వీళ్లకు ఓటుతో బుద్ధి చెప్పి, కల్వకుంట్ల "గడీల" పాలనకు చరమగీతం పాడుదాం! ఏనుగుకు ఓటేసి మన బహుజన రాజ్యం స్థాపించుకుందాం’ అని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు.