అమర వీరుల స్మారకంలోనూ అవినీతే.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-22 09:10:00.0  )
అమర వీరుల స్మారకంలోనూ అవినీతే.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: అమర వీరుల స్మారకంలోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో 1,569 మంది అమరులయ్యారన్నారు. త్యాగాలను పాల్పడిన వారిన అవమానించేలా బీఆర్ఎస్ వ్యహరిస్తోందన్నారు. అమరవీరుల స్థూపం నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందని ఆరోపించారు. అమరవీరుల స్థూపం నిర్మాణం కోసం 2018లో రూ.63కోట్లకు టెండర్ పిలిచారన్నారు. ఒకే కంపెనీ మూడు డమ్మీ టెండర్లు వేసిందన్నారు. కేటీఆర్ చేరగానే కేసీ పుల్లయ్య కంపెనీ కేపీసీ కంపెనీ అయిందన్నారు. ఆ కంపెనీ అడ్రెస్ విజయవాడకు మారిందన్నారు. నూతన అమరవీరుల స్మారకం వద్ద అమరవీరుల పేర్లు లేవని అలాంటప్పుడు శిలాఫలకాలపై కేసీఆర్ ఎలా పెడతారన్నారు. వందలాది మంది వీరుల త్యాగాలను కేసీఆర్ కాలగర్భంలో కలిపేశారన్నారు.

Also Read..

ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్! ‘ఇంటింటికి బీజేపీ’‌కి ఇద్దరు కీలక నేతలు దూరం

Advertisement

Next Story