- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ గాంధీ రియాక్షన్ ఇదే! (వీడియో)
దిశ, వరంగల్ బ్యూరో: మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మీ అభిప్రాయం చెప్పండి అంటూ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అభిప్రాయం కోరిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. కొన్ని నెలల క్రితం రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటించిన్నప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మీ అభిప్రాయం తెలియజేయండంటూ అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానమిచ్చారు. మహిళా బిల్లు రిజర్వేషన్ బిల్లుకు మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం, ఖచ్చితంగా మహిళలు రాజకీయాల్లో, వ్యాపారాల్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు.
గతంలో మిత్రపక్షాల నుంచి మద్దతు లేకపోవడంతో బిల్లు పాస్ చేయలేకపోయాయని, ఈసారి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా బిల్లు పాస్ చేస్తామని తెలిపారు. హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ప్రశ్నకు రాహుల్ గాంధీ అభిప్రాయం వ్యక్తం చేసిన వీడియో తాజాగా కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి సిద్ధమవుతున్న వేళ వైరల్ అవుతుండటం గమనార్హం. రాహుల్‌గాంధీ అమెరికా పర్యటన తర్వాత హనుమాండ్ల ఝాన్సీరెడ్డి మూడు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయడం దాదాపుగా ఖాయమైంది. టీపీసీసీ సభ్యురాలిగా నియామకంతో పాటు ఇటీవల జరిగిన విజయభేరి సభకు బ్రాండింగ్ కమిటీ కన్వీనర్‌గా ఝాన్సీరెడ్డి వ్యవహరించారు.
Read More..
మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన పవన్ కల్యాణ్
కేంద్ర నిర్ణయంతో కన్‌ఫ్యూజన్‌లో టీ కాంగ్రెస్.. అభ్యర్థుల ఎంపికకు బ్రేక్..?