- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS Elections: గంట సమీపిస్తున్నా అక్కడ ప్రారంభం కాని పోలింగ్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఒక్కసారిగా ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆగిపోయింది, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మియాపూర్, చర్లపల్లి, మహేశ్వరం, మలక్‌పేట్, డోర్నకల్, మోతే, అశ్వరావుపేట, అశ్వపురం, గోషామహాల్, అత్తాపూర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటు హక్కు వినియోగించుకోవడానికి జనాలు రావడంతో భారీగా క్యూ నెలకొంది. ప్రస్తుతం అధికారులు ఈవీఎంలు సరిచేసే పనిలో ఉన్నారు. కొత్త మిషన్లు తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కాగా, నేడు రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 35,655 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 3.26 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు దాదాపు లక్ష మంది రాష్ట్ర పోలీసులు, కేంద్ర పారామిలిటరీ బలగాలు, ఇతర రాష్ట్రాల హోంగార్డులను ఎలక్షన్ కమిషన్ వినియోగిస్తున్నది.