- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దేశంలో జమిలీ ఎన్నికలు అందుకే.. కారణం చెప్పిన మంత్రి తలసాని
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. రాష్ట్రాల ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని చూస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో కేంద్రం నిమగ్నమై ఉంది. త్వరలో పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. కొన్ని పార్టీలు జమిలీ ఎన్నికలను ఆహ్వానిస్తుండగా.. మరికొన్ని ఎన్నికలు వ్యతిరేకిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కేంద్రంలోని బీజేపీ జమిలీ ఎన్నికలను నిర్వహించాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు.
కానీ డబ్బును ఆదా చేసేందుకు జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్దమవుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కూడా జమిలీ ఎన్నికలపై విమర్శలు కురిపిస్తోంది. తాజాగా జమిలీ ఎన్నికలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఏ రాష్ట్రంలోనూ బీజేపీ గెలిచే పరిస్థితి లేదని, అందుకే జమిలీ ఎన్నికలకు వెళుతున్నారని విమర్శించారు. ఓటమి నుంచి తప్పించుకునేందుకు బీజేపీ వన్ నేషన్-వన్ ఎలక్షన్ విధానం తీసుకొస్తుందని ఆరోపించారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోతామనే భయం బీజేపీకి పట్టుకుందని, అందుకే లోక్‌సభ ఎన్నికలను ముందుకు తీసుకురావాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలి
షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని తలసాని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్దంగా ఉన్నామని, తాము భయపడే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. ఒకేసారి తాము 115 అభ్యర్థులను ప్రకటించామని, అలాంటి తమ పార్టీకి ఎలాంటి భయం లేదని తెలిపారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, పార్లమెంట్ రద్దు చేసి జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే మంచిదని తలసాని సూచించారు.