Chandrababu Naidu Arrest : అరెస్ట్‌పై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2023-09-14 05:51:23.0  )
Chandrababu Naidu Arrest : అరెస్ట్‌పై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్‌పై తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ.. అది ఏపీలోని రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న గొడవ అని చెప్పారు. గొడవతో తమకు, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. అల్టిమేట్‌గా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.. ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. అనంతరం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఇన్నేళ్లు తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలని పార్టీ బీజేపీ అని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ఆ పార్టీకి సరిగా కేడర్ కూడా లేదని విమర్శించారు. కుట్రపూరితంగానే కేంద్రం కవితను ఇబ్బంది పెట్టేందుకు యత్నించిందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమని.. మళ్లీ బీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిస్తామని అన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని.. అలాంటిది రాష్ట్ర ప్రజలు ఎందుకు వదులుకుంటారని అభిప్రాయపడ్డారు. ఓటమి భయంతోనే బీజేపీ జమిలి నినాదం ఎత్తుకున్నదని.. జనాల్ని నమ్ముకున్న బీఆర్ఎస్‌కు జమిలితో నష్టం లేదని చెప్పారు.

More News : చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై.. సినీ నటి పూనమ్ కౌర్ రియాక్షన్

Advertisement

Next Story