- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ అదే పనిమీద ఉన్నాడు.. మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మేనిఫెస్టోపై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపో మాపో బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల కాబోతోందని అన్నారు. ప్రజలకు ఇంకా ఏం చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నడని.. దానిపైనే కసరత్తు చేస్తున్నారని తెలిపారు. మూడు గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. అసలు రైతులంటే కాంగ్రెస్ లీడర్లకు ప్రేమ ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతోందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో చూస్తే ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ కావాల్సిందేనని పేర్కొన్నారు.
ఎవరేమన్నా తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచి తీరుతుందని, మూడోసారి అధికారంలోకి రాబోతున్నామని అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో మతకల్లోలాలు రేపిందని, మళ్లీ కల్లబొల్లి హామీలతో కాంగ్రెస్ ప్రజల ముందుకు వస్తుందని పేర్కొన్న ఆయన కాంగ్రెస్ ఒక భస్మాసుర హస్తం అంటూ మండిపడ్డారు. తెలంగాణ కేసీఆర్ అడ్డా అని నడ్డా గుర్తు పెట్టుకోవాలంటూ పేర్కొన్నారు. సొంత రాష్ట్రంలోనే బీజేపీని గెలిపించుకోలేని నడ్డా తెలంగాణలో బీజేపీని ఎలా గెలిపిస్తారంటూ ప్రశ్నించారు.